విశాఖ జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా కరోనా కేసులు 100కు పైగా నమోదయ్యాయి. దాంతో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసింది. అలాగే ఆస్పత్రుల్లో అదనపు పడకలు, మందులను సిద్ధం చేసినట్లు డీఎంహెచ్వో విజయలక్ష్మి తెలిపారు. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. భౌతిక దూరం, మాస్క్లు ధరించటం అలవాటు చేసుకోవాలని సూచించారు.
విశాఖలో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన అధికారులు - విశాఖ జిల్లా వార్తలు
Focus on Corona: విశాఖ జిల్లాలో మూడు రోజులుగా కరోనా కేసులు 100కు పైగా నమోదయ్యాయి. అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారులు.. పరీక్షా కేంద్రాల్ని అదనంగా ఏర్పాటు చేశారు. ఆస్పత్రుల్లో అదనపు పడకల ఏర్పాటుతో.. ముందస్తుగా సన్నద్ధమైనట్లు డీఎంహెచ్వో విజయలక్ష్మి తెలిపారు.
Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 18,815 మంది వైరస్ బారినపడగా.. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య గురువారంతో పోలిస్తే 100కు పైగా కేసులు తగ్గాయి. కొవిడ్ నుంచి 15,899 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.52 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.27 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతానికి పెరిగింది.
- మొత్తం మరణాలు: 5,25,343
- యాక్టివ్ కేసులు: 1,22,335
- కోలుకున్నవారి సంఖ్య: 4,29,37,876
ఇదీ చదవండి: