అదానీ, అంబానీ చేతిలో ప్రధాని మోదీ కీలు బొమ్మగా మారారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంపై ఆయన స్పందించారు. విశాఖ స్టీల్ భూములు కోట్లాది రూపాయలు పలుకుతాయని.. ఈ ఆస్తులపై కన్నేసిన అదానీ, అంబానీలతో ప్రధాని మోదీ అవగాహన కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటుపరమైతే...అందులోని ఉద్యోగులకు రిజర్వేషన్లు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్‌లను కూడా అమ్మేస్తారని.. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థలను కాపాడుకునేందుకు పెద్దఎత్తున ఉద్యమం చేయాల్సి ఉందన్నారు.
మోదీ రిమోట్ కంట్రోల్.. అదానీ, అంబానీల చేతిలో ఉందని విమర్శించారు. విశాఖ ఉక్కును కాపాడుకోకపోతే.. ప్రజలు క్షమించరని, ఇందుకోసం కాంగ్రెస్ భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని అభిప్రాయపడ్డారు.