కొవిడ్-19 బారినపడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ మనోజ్‌కు... జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో విశాఖలోని సీతమ్మధార ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అత్యవసర సేవలు అందిస్తున్న వర్గాల్లో జర్నలిస్టులు ముందున్నారని ఏపీయూడబ్ల్యూజే నగర అధ్యక్షుడు రావుల రామచంద్రరావు అన్నారు. ఈ దశలో పనిచేస్తున్న జర్నలిస్టులకు రూ.50 లక్షలు జీవిత బీమా వర్తింప చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కొవిడ్ సమయంలో పని చేస్తూ... ప్రాణాలు కోల్పోయిన మనోజ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
కరోనాతో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ మనోజ్‌కు నివాళులు
కొవిడ్-19 బారినపడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ మనోజ్‌కు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో... విశాఖ జర్నలిస్టులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మనోజ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి ఆర్ధిక సాయం అందించాలని ఏపీయూడబ్ల్యూజే నగర అధ్యక్షుడు రావుల రామచంద్రరావు డిమాండ్ చేశారు.
జర్నలిస్టులకు శానిటైజర్లు అందజేసిన విద్యార్థిని
విశాఖలోని మాధవధార ప్రాంతానికి చెందిన మూల వెంకట్రావు కుమార్తె జనని పదో తరగతి చదువుతుంది. కరోనా బారినపటి ప్రాణాలుకోల్పోయిన జర్నలిస్ట్ మనోజ్ మరణించిన తీరు సోషల్ మీడియాలో చూసిన ఆమె చలించిపోయింది. ఇంకొకరు అలాంటి పరిస్థితికి చేరకూడదని తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. కొన్నేళ్లుగా తను దాచుకుంటున్న పాకెట్ మనీ రూ.10 వేలు ఇచ్చి తన తండ్రి ద్వారా మాస్కులు... శానిటైజర్లు కొనుగోలు చేసి కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులకు అందజేసింది. చిన్నారి జనని ఆలోచనలను జర్నలిస్టులు అందరూ ప్రశంసించారు.