విశాఖ సమీపంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఏపీ రాష్ట్ర అతిథిగృహం నిర్మాణానికి ఒకే ఒక టెండర్ (బిడ్) దాఖలయింది. భీమిలి నియోజకవర్గం కాపులుప్పాడ ప్రాంతంలోని గ్రేహౌండ్స్ కొండపై 30 ఎకరాల్లో దీనిని నిర్మించాలనుకున్నారు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పర్యవేక్షణలో సమగ్ర నిర్మాణ ఆకృతులు, ప్రాజెక్టు నిర్వహణ సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించగా బుధవారం గడువు ముగిసే సమయానికి ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. తగిన స్పందన రాని నేపథ్యంలో మరో వారం రోజులు గడువు పొడిగించనున్నట్లు తెలిసింది. ఈ నెల 18న జరిగిన ప్రీబిడ్ సమావేశానికి ఎనిమిది మంది హాజరయ్యారు. టెండర్ దాఖలు చేసిన సంస్థ కూడా మరో రాష్ట్రానికి చెందినదని తెలిసింది.
రాష్ట్ర అతిథి గృహ నిర్మాణానికి ఆసక్తి చూపని సంస్థలు - రాష్ట్ర అతిథి గృహ నిర్మాణానికి ఆసక్తి చూపని సంస్థలు
విశాఖ సమీపంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఏపీ రాష్ట్ర అతిథిగృహం నిర్మాణానికి ఒకే ఒక టెండర్ (బిడ్) దాఖలయింది. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో సమగ్ర నిర్మాణ ఆకృతులు, ప్రాజెక్టు నిర్వహణ సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించగా బుధవారం గడువు ముగిసే సమయానికి ఒకే ఒక్క బిడ్ దాఖలైంది.
guest house