Repairs on roads విశాఖపట్నానికి చెందిన రవ్వా సుబ్బారావు ఈ నెల 4న ద్విచక్రవాహనంపై విశాఖపట్నం డీఆర్‌ఎం కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్తూ రహదారి మధ్యలో ఉన్న గుంత వల్ల కిందపడిపోయాడు. ఆ సమయంలో సుబ్బారావు తలకు తీవ్ర గాయమైంది. రెండు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఈనెల 6న మృతి చెందారు. ఈ ప్రమాదం మరిచిపోక ముందే అదే గుంత వల్ల మరో యువకుడూ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న సుబ్బారావు అల్లుడు వెంకటరావు చలించిపోయారు. అయినవారు దూరమైన బాధలో ఉన్నా.. మానవత్వంతో స్పందించారు. మరెవరికీ ఆపద రాకూడదని తన సొంత ఖర్చుతో సిమెంటు, ఇసుక, కంకర తెచ్చి స్వయంగా గుంతను పూడ్చి వెళ్లారు. అధికారులు చేయాల్సిన పనిని ఇలా ప్రజలే చేసుకోవాల్సి రావడమేంటని అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
Repairs on roads ఆ బాధ మరెవరికీ రావొద్దని - విశాఖలో ఆ బాధ మరెవరికీ రావొద్దని గొయ్యిని పూడ్చిన వ్యక్తి
Repairs on roads రహదారి మధ్యలో ఉన్న గుంతను పూడుస్తున్నది జీవీఎంసీ సిబ్బంది కాదు. దాని వల్ల నష్టపోయిన కుటుంబ సభ్యులు. ఆ గుంత వల్ల కుటుంబ సభ్యుడిని కోల్పోయి.. ఆ కష్టం మరెవరికీ రావద్దనే ఆలోచనతో కన్నీటిని దిగమింగుకొని రోడ్డు గుంతను పూడుస్తూ కనిపించారు.
గుంతను పూడుస్తు