మత్స్యకారుల మధ్య నెలకొన్న రింగు వలల వివాదం పరిష్కారానికి ముగ్గురు నిపుణులతో కమిటీ వేసినట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాతో సమావేశమయ్యారు. సీఎంఎఫ్ఆర్ఐ, సీఐఎఫ్టీ, సిఫ్నెట్ నుంచి ముగ్గురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
రింగు వలల వివాదానికి రెండు రోజుల్లో పరిష్కారం: మంత్రి ముత్తంశెట్టి
రింగు వలల వివాదానికి రెండు రోజుల్లో పరిష్కారం లభిస్తుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
రింగు వలల వివాదానికి రెండు రోజుల్లో పరిష్కారం
ఈ కమిటీ సిఫార్సుల మేరకు రెండు రోజుల్లో మత్స్యకారుల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరిస్తామన్నారు. సాంకేతిక కమిటీ నివేదిక వచ్చే వరకు మత్స్యకారులు సమన్వయం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు