ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జిల్లాలోని వివిధ పరిశ్రమలపై సర్వే - విశాఖపట్నం తాజా వార్తలు

జిల్లాలో ఉన్న పరిశ్రమలపై సమగ్ర సర్వే నిర్వహణకు కలెక్టర్​ సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. సర్వేకు వచ్చే అధికారులకు పరిశ్రమల యాజమాన్యాలు సహకరించవలసిందిగా కోరారు.

vizag collector vinay chand review on ap industrial survey
పరిశ్రమల అధికారులతో విశాఖ కలెక్టర్​ సమీక్ష

By

Published : Sep 29, 2020, 6:29 PM IST

విశాఖ‌ జిల్లాలో ఉన్న వివిధ పరిశ్రమలపై సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమ సర్వే-2020పై పరిశ్రమల అధికారులతో స‌మీక్షించారు. జిల్లాలోని సుమారు 11 వేల పరిశ్రమల్లో దాదాపు 7 వేల దాకా తయారీ పరిశ్రమలు, 144 భారీ పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఈ సర్వేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్స్, పట్టణ ప్రాంతాల్లోని వార్డ్​ అమినెటి సెక్రటరీలతో చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు జిల్లాలో 30 మంది లీడ్ ఆఫీసర్స్​ను ఎంపిక చేశారు.

పరిశ్రమల ఎస్టేట్​లలో ఏపీఐఐసీ అధికారులు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పరిశ్రమల శాఖాధికారులు... పర్యవేక్షణాధికారులుగా ఉంటార‌న్నారు. సర్వే కోసం వచ్చిన అధికారులకు కావలసిన పూర్తి సహాయ, సహకారాలను అందించి సహకరించవలసిందిగా పరిశ్రమల యజమాన్యాలకు కలెక్టర్ కోరారు. ఈ సర్వే ద్వారా పరిశ్రమల నుంచి సేకరించిన సమాచారం గోప్యంగా ఉంచుతామ‌న్నారు. ఈ సర్వేను అక్టోబరు 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details