విశాఖలో మరిన్ని పడకలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వైద్యులను ఆదేశించారు. కొవిడ్-19ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్యులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్-19 సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఏఎంసీ ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్‌ను ఆదేశించారు. కరోనాను ఎదుర్కొనేందుకు నిధులు సమస్య జిల్లాకు లేదన్నారు. కాబట్టి స్పెషలిస్టులు, వైద్యులు అందరూ సహకరించి కరోనా మహమ్మారిని ఎదుర్కొవాలన్నారు. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్యులు తమవంతు సహకారం అందించాలని కోరారు.
'ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మరిన్ని పడకలు సిద్ధం చేయండి' - visakhapatnam collector latest news
కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ వైద్యులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మరిన్ని పడకలు సిద్ధం చేయాలని కోరారు. కరోనాను ఎదుర్కొనేందుకు జిల్లాలో నిధుల కొరత లేదన్నారు.
వైద్యులతో సమావేశమైన విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్