ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు కరోనా టీకా రెండో డోస్​ స్పెషల్​ డ్రైవ్​.. పూర్తైన ఏర్పాట్లు

విశాఖ నగరంలో రేపు రెండో డోస్​ కరోనా టీకా వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ వినయ్​చంద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని, వ్యాక్సినేషన్​ కేంద్రాల వివరాలను తెలియజేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

vaccination second drive in vizag tomorrow
టీకా రెండో డోస్​ స్పెషల్​ డ్రైవ్ రేపే

By

Published : Apr 21, 2021, 9:55 PM IST

విశాఖ నగరంలో 39,111 మందికి రేపు యుద్ధ ప్రాతిపదికన రెండో డోస్ కోవిడ్ టీకా పంపిణీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి డోస్ తీసుకుని, రెండో డోస్ తీసుకోవలసిన వారికి రేపు 160 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఇందుకోసం కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్​ డోసులను సిద్ధం చేస్తున్నట్టు ఆయన అన్నారు. ఆరోగ్య సిబ్బందికి విశాఖలోని 7 బోధనాసుపత్రుల్లో, 16 వైద్య విధాన పరిషత్​లలో టీకా వేస్తున్నట్లు వెల్లడించారు.

85 శాతం మంది ఇంటి వద్దే కోలుకుంటున్నారు..

నగరంలో కొవిడ్ బారిన పడినవారిలో 85 శాతం మంది ఇంటి వద్ద నుంచే చికిత్స పొందుతున్నారని.. కేవలం 10 శాతం మంది మాత్రమే స్వల్ప లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ స్పష్టం చేశారు. మిగిలిన 5 శాతం మంది వెంటిలేటర్ సౌకర్యంతో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్​లో కలిపి మెుత్తం 6 వేల 700 బెడ్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కేజీహెచ్, చెస్ట్, గోషా హాస్పిటల్​లో ఆరోగ్య సిబ్బందికి టీకా అందుబాటులో ఉంటాయన్నారు.

కోవ్యాక్సిన్​ టీకా వేసే కేంద్రాలు..

స్వర్ణభారతి స్టేడియం, కేజీహెచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రీజినల్ ఐ హాస్పిటల్, టీబీ కంట్రోల్ హాస్పిటల్ నర్సీపట్నం, పాడేరు జనరల్ హాస్పిటల్ కోవాగ్జిన్ ఇస్తారని చెప్పారు.

ఇవీ చదవండి:

వాతావరణం: రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు

'ఆ జిల్లాల్లో 15% పైగా పాజిటివిటి రేటు'

ABOUT THE AUTHOR

...view details