ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓ పక్క వర్షాలు...మరో పక్క తగ్గుతున్న ఉష్ణోగ్రతలు - విశాఖలో భారీ వర్షాలు

విశాఖ నగరంలో రెండు రోజులుగా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. అత్యధికంగా గంగవరంలో 10సెం.మీ వర్షపాతం నమోదైంది. నగరంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పడుతున్నాయి.

cold-weather-in-visakha-district
విశాఖలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

By

Published : Nov 28, 2020, 12:24 PM IST

రెండు రోజులుగా విశాఖ నగరంలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లావారుజాము వరకు చాలాచోట్ల భారీవర్షాలు పడ్డాయి. అత్యధికంగా గంగవరంలో 10సెం.మీ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, సీతమ్మధార, మధురవాడ, బీచ్‌రోడ్లు.. వాటి చుట్టుపక్కప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి. వాల్తేరులో 7సెం.మీ, విమానాశ్రయంలో 6.3సెం.మీ కురిసినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరోవైపు చాలాచోట్ల 3సెం.మీ మించి కురిసింది. అలాగే శుక్రవారం రాత్రి దాకా పలుప్రాంతాల్లో 3సెం.మీ వరకు వర్షపాతం నమోదైంది. చాలావరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 4రోజులూ మేఘావృతమై ఉంటుందని, పలుచోట్ల జల్లులు కూడా పడొచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

*గురువారం ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8.30గంటల దాకా నగరంలో భారీవర్షపాతం నమోదైంది.

ప్రాంతం వర్షపాతం (సెం.మీ.లలో)
గంగవరం 10.0
రాంబిల్లి 9.4
నాతయ్యపాలెం 9.4
పరవాడ 9.0
మదీనాబాగ్‌ (పెదగంట్యాడ) 8.6
ధారపాలెం 8.5
అక్కిరెడ్డిపాలెం 8.0
గాజువాక 7.8
దేశపాత్రునిపాలెం 7.6
అనకాపల్లి 7.6
అగనంపూడి 7.2
మేఘాద్రిగెడ్డ 7.2
షీలానగర్ 7.1
అచ్యుతాపురం 7.1
మింది 7.1
సింహాచలం 7.0
పోర్టు స్టేడియం 7.0
పెదగంట్యాడ 6.9
సబ్బవరం 6.9
సతివానిపాలెం (పెందుర్తి) 6.8
ఆరిలోవ 6.7
శ్రీహరిపురం 6.7
కూర్మన్నపాలెం 6.6
సీతమ్మధార 6.6
కేబీఆర్‌ 6.5
గవరపాలెం 6.5
వుడాపార్క్‌ 6.3
ఫార్మాసిటీ 6.2
పెందుర్తి 6.2
దువ్వాడ 6.1
ప్రహ్లాదపురం 6.1
వేపగుంట 5.9
విశాఖవ్యాలీస్కూల్‌ 5.9
కేంద్ర కారాగారం 5.8
పెదవాల్తేరు 5.5
మధురవాడ 5.5
మర్రిపాలెం 5.5
బుచ్చిరాజుపాలెం 5.4
హెచ్‌బీకాలనీ 5.4
ఎంవీపీకూడలి 5.1
భీమిలి 5.1

తగ్గిన ఉష్ణోగ్రతలు

నగరంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. గురువారం రాత్రి వాల్తేరులో 18.4డిగ్రీలు, విమానాశ్రయంలో 19.6డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. గత మూడ్రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి.

ఇదీ చదవండి:

రైతుల రెక్కల కష్టం నీళ్ల పాలు

ABOUT THE AUTHOR

...view details