CM Ramesh Rajya Sabha Member: అమరావతి రైతుల పాదయాత్రకు భాజపా రక్షణ కవచంలా ఉంటుందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. విశాఖ భాజపా కార్యాలయంలో మాట్లాడుతూ.. రైతులతో పాటు తాము సైతం పాదయాత్రలో పాల్గొంటామన్నారు. అమరావతి రైతుల మహా పాదయాత్రపై దాడి చేస్తే భాజపాపై దాడి చెసినట్టేనని సీఎం రమేష్ పేర్కొన్నారు. ఎవరెన్ని చెప్పినా ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగుతుందన్నారు. వైకాపా చేసే తప్పులన్నీ కేంద్రానికి చెప్పి చేస్తున్నామని చెప్పుకుంటున్నారని.. అది అవాస్తవమని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ పునాది రాయి వేసిన రాజధానిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని కేంద్రం ఎలా అంగీకరిస్తుందని సీఎం రమేష్ ప్రశ్నించారు.
రైతుల మహా పాదయాత్రకు రక్షణ కవచంలా భాజపా: సీఎం రమేష్
BJP Leader CM Ramesh: అమరావతి రైతుల పాదయాత్రకు రక్షణ కవచంలా ఉంటామని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అన్నారు. విశాఖలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అమరావతి రైతులపై దాడి చేస్తే.. భాజపాపై దాడి చేసినట్లేనని ఆయన హెచ్చరించారు. ప్రధాని పునాది వేసిన అమరావతిని కేంద్రం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ హెల్త్ విశ్వ విద్యాలయం పేరు మార్పును వైకాపా వాళ్లే అంగీకరించడం లేదని ఎద్దేవా చేశారు. స్వయంగా వైఎస్ కుమార్తె షర్మిల ఈ విషయంపై మాట్లాడుతున్నారని వెల్లడిచారు. వైఎస్ వివేకానంద హత్య కేసు సాక్ష్యాలు తారుమారు చేశారని విమర్శించారు. 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని చెప్తున్నారు.. ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఇన్ని అవినీతి, అక్రమాలు చేసిన తరువాత రాష్ట్ర ప్రజలు ఎలా విశ్వసిస్తారని విమర్శించారు. భాజపా, జనసేన పొత్తు కొనసాగుతోందని సీఎం రమేష్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: