ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM JAGAN: "ఐఎన్‌ఎస్ విశాఖపట్నం" నౌకను జాతికి అంకితం చేసిన సీఎం జగన్ - CM Jagan vishaka tour

CM JAGAN: ఐఎన్‌ఎన్‌ విశాఖపట్నం నౌకను ముఖ్యమంత్రి జగన్ సందర్శించారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

సీఎం జగన్
సీఎం జగన్

By

Published : Feb 27, 2022, 3:58 PM IST

Updated : Feb 27, 2022, 5:16 PM IST

CM JAGAN: బహుళ దేశాల నౌకాదళ విన్యాస (మిలాన్‌-22) కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం విశాఖ విచ్చేశారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం విశాఖ చేరుకున్న సీఎం.. నేరుగా తూర్పు నౌకాదళ కేంద్రానికి వెళ్లారు. నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఐఎన్‌ఎస్‌ -విశాఖ నౌకను జాతికి అంకితం చేశారు. ఐఎన్‌ఎస్‌ -విశాఖ నౌక పశ్చిమ నౌకాదళంలో సేవలందించనుంది.

ఐఎన్‌ఎన్‌ విశాఖపట్నం నౌకను సందర్శించిన సీఎం జగన్

ఈ సందర్భంగా జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వేలను సీఎం సందర్శించారు. సాయంత్రం విశాఖ బీచ్‌లో జరిగే మిలాన్‌కు హాజరై ప్రసంగిస్తారు. కవాతు కార్యక్రమాలు వీక్షిస్తారు. సీఎంతో పాటు సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎం.వి.వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన చిన్నారి​.. వీడియో వైరల్​!

Last Updated : Feb 27, 2022, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details