ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan Visaka Tour: విశాఖలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం జగన్ - విశాఖ తాజా వార్తలు

CM Jagan Visahapatnam Tour: విశాఖ నగర వాసులు ఎదురు చూస్తున్న ఎన్​ఏడీ పై వంతెనను సీఎం జగన్‌.. శుక్రవారం జాతికి అంకితం చేశారు. దీనితో పాటు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో 186 కోట్ల రూపాయలతో... చేపట్టిన పలు ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు.

విశాఖ ఎన్‌ఏడీ కూడలిలో పైవంతెనను ప్రారంభించిన సీఎం జగన్
విశాఖ ఎన్‌ఏడీ కూడలిలో పైవంతెనను ప్రారంభించిన సీఎం జగన్

By

Published : Dec 17, 2021, 9:01 PM IST

Updated : Dec 18, 2021, 12:52 AM IST

CM Jagan Visahapatnam Tour: విశాఖలో శుక్రవారం పర్యటించిన సీఎం జగన్‌ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 150 కోట్ల రూపాయలతో వీఎంఆర్డీఏ నిధులతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేశారు. అలాగే 7.60 కోట్లతో పిఠాపురం కాలనీలో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ ను, 7.55 కోట్లతో ఆనందరపురం జంక్షన్ నుంచి బోని వరకు 9 కిలోమీటర్ల మేర విస్తరించిన రోడ్డును, 7.50 కోట్లతో అభివృద్ధి చేసిన పెదరుషికొండ - బీచ్ మాస్టర్ ప్లాన్ రోడ్డును ప్రారంభించారు. 6.97 కోట్లతో అభివృద్ధి చేసిన విశాఖ వ్యాలీ రోడ్డును, 5.14 కోట్లతో చినముషిడివాడలో నిర్మించిన కల్యాణ మండపాన్ని, 1.56 కోట్లతో తాడిచెట్లపాలెంలోని ధర్మానగర్లో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఎన్​ఏడీ వేదిక పై స్విచ్ నొక్కి ప్రారంభించారు.

సీఎం చేతుల మీదుగా ఉడా పార్కు ప్రారంభోత్సవం..

విశాఖ సాగర తీరంలో అందాలకు చిరునామాగా మారిన ఉడా పార్కు సుందరీకరణ పనుల అనంతరం శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా మహా విశాఖ నగర పాలక సంస్థ (జి.వి.ఎం.సి) ఆధ్వర్యంలో సుమారు రూ.61 కోట్లు వెచ్చించి నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఉడా పార్కు వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సం జరిగింది. ఈ క్రమంలో రూ.33.50 కోట్లతో ఉడా పార్కులో చేపట్టిన అభివృద్ధి పనులను, రూ.11.45 కోట్లు వెచ్చించి జగదాంబలో నిర్మించిన మల్టీ లెవెల్ సెమీ ఆటోమెటిక్ కార్ పార్కింగ్ కేంద్రాన్ని, రూ.4.65 కోట్లతో దండు బజార్లో అభివృద్ధి చేసిన ఎంవీడీ ఉన్నత పాఠశాలను, రూ.4.24 కోట్లతో అభివృద్ధి చేసిన హెరిటేజ్ కన్జర్వేషన్ హాలును, రూ.7.16 కోట్లతో అభివృద్ధి చేసిన ఓల్డ్ మున్సిపల్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం స్థానిక పార్కులో కాసేపు పర్యటించి నూతనంగా అభివృద్ధి చేసిన పనులను పరిశీలించారు. ఈ నెల 21న రాజ్యస‌భ స‌భ్యులు విజ‌య‌సాయి రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్రారంభం కానున్న వైఎస్సార్ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ ట్రోఫీని ముఖ్య‌మంత్రి ఉడా పార్కులో ఆవిష్క‌రించారు.

వెంకయ్య నాయుడు మనవరాలి రిసెప్షన్‌లో..

పీఎం పాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌లో జరిగిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌లో పాల్గొనారు..అనంతరం రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు సీఎంతో పాటు మంత్రులు పర్యటనలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణ సమయంలో మద్దిలపాలెంలో సీఎం కాన్వాయి ట్రాఫిక్ వల్ల కొంత ఇబ్బంది ఎదురుకుంది.

సీఎం పర్యటన లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ప్ర‌వీణ్ ప్ర‌కాశ్‌, చీఫ్‌ విప్ బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, సత్యవతి, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరదు కళ్యాణి, ఎమ్మెల్యేలు ధర్మ శ్రీ, భాగ్యలక్ష్మి, అదీప్ రాజు, కన్నబాబు, వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి, జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర, కలెక్టర్ మల్లిఖార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా, వీఎంఆర్డీఏ కమిషనర్ వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి

RRR On Amaravati: రాజధానిని మార్చడం ఎవరివల్లా కాదు: రఘురామ

Last Updated : Dec 18, 2021, 12:52 AM IST

ABOUT THE AUTHOR

...view details