విశాఖ డీఆర్సీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై నేతలను సీఎం జగన్ వివరణ అడిగారు. కొందరు ఎమ్మెల్యేలు భూముల అక్రమాలకు పాల్పడుతున్నారని డీఆర్సీ సమావేశంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సమావేశంలో బహిరంగంగా అభ్యంతరం తెలిపారు. తాము నిజాయితీగా ఉన్నామని.. తప్పు చేశామని తేలితే దేనికైనా సిద్ధమని సమావేశంలో తెలిపారు. తాను ఎక్కడా భూ అక్రమాలు చేయలేదని.., నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సాయిరెడ్డిని ఉద్దేశించి సవాల్ చేశారు. నాడు-నేడు పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని డీఆర్సీ సమావేశంలో వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. అధికారులపైనా విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని సర్ధి చెప్పారు. వివాదం పార్టీలో చర్చనీయాంశం కావడంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలతో సమావేశమై సాయిరెడ్డి సహా ఎమ్మెల్యేలతో వివరణ తీసుకున్నట్లు తెలిసింది. సమావేశంలో జరిగిన పరిణామాలపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇకపై బహిరంగ వ్యాఖ్యలు, ఆరోపణలు చేయవద్దని అంతా కలసి పనిచేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సీఎం జగన్ సీరియస్.. క్యాంపు కార్యాలయానికి విశాఖ నేతలు - గుడివాడ అమర్నాథ్పై సీఎం జగన్ కామెంట్స్
విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో వైకాపా నేతల మధ్య జరిగిన వివాదం తాడేపల్లికి చేరింది. డీఆర్సీ సమావేశంలో వైకాపా నేతలు పరస్పర వ్యాఖ్యలు, ఆరోపణలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్లను క్యాంపు కార్యాలయానికి పిలిపించారు.
సీఎం జగన్ సీరియస్.. క్యాంపు కార్యాలయానికి విశాఖ నేతలు