ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్న జగన్​ - విశాఖ తాజా వార్తలు

CM Jagan in AU గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. విశాఖలో మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన విద్యార్థులకు ఆయన ధ్రువపత్రాలు అందించారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని చెప్పారు. డిగ్రీతోపాటుగా జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

CM Jagan in AU
సీఎం జగన్​

By

Published : Aug 26, 2022, 4:38 PM IST

CM Jagan in AU: స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విశాఖలోని ఏయూలో విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్​ స్పష్టం చేశారు. స్కిల్‌ డెవల్‌మెంట్‌లో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సీఎం.. సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ 40 రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తోందని జగన్​ తెలిపారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని.. ఇంగ్లీష్ మీడియం లేకపోతే పిల్లలకు భవిష్యత్ ఉండదని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రారంభించామని స్పష్టం చేశారు. డిగ్రీతోపాటు జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ప్రారంభిస్తున్నాని చెప్పారు. కోర్సులు పూర్తయిన వారికి ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

సీఎం జగన్​

"స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. మైక్రోసాఫ్ట్‌ సంస్థ 40 రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియం లేకపోతే పిల్లలకు భవిష్యత్ ఉండదు. ప్రాథమిక పాఠశాలల నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాం. డిగ్రీతోపాటు జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ప్రారంభిస్తున్నాం. కోర్సులు పూర్తయిన వారికి ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నాం" -సీఎం జగన్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details