విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో సీఎం జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి.. ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. యువ నాయకుని పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఎంపీ అన్నారు. ఆడిటర్ జి.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు, ప్రకాశం జిల్లాల వ్యాప్తంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. దర్శి నియోజకవర్గంలోని పాస్టర్ల దంపతులకు బట్టలు పంపిణీ చేశారు. పట్టణంలోని గాంధీనగర్ రామాలయం నుంచి స్థానిక గడియార స్తంభం వరకు పాదయాత్ర చేశారు.