ఏపీలో విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. విశాఖలో అభివృద్ధికి అపార అవకాశం ఉందన్నారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందన్న సీఎం.. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం భావి తరాలు వలస వెళ్లకూడదని అభిప్రాయపడ్డారు. విజయవాడ గేట్ వే హోటల్‌లో 'ది హిందూ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరయ్యారు.
రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు చేయలేం: సీఎం జగన్ - విశాఖ అభివృద్ధిపై జగన్ వ్యాఖ్యలు న్యూస్
పదేళ్లలో విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని సీఎం జగన్ అన్నారు. విశాఖలో మౌలిక వసతులన్నీ ఉన్నాయని స్పష్టం చేశారు.
![రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు చేయలేం: సీఎం జగన్ cm jagan about vishaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5963257-250-5963257-1580883217137.jpg)
cm jagan about vishaka
'విశాఖలో మౌలిక వసతులన్నీ ఉన్నాయి'
'పేదలు కూడా ఆంగ్ల మాధ్యమంలో చదవాలి'
మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు తీసుకొచ్చాం. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. పిల్లలను బడికి పంపిన తల్లులకు రూ.15 వేలు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరికి విద్య.. ఆంగ్ల మాధ్యమంలో ప్రావీణ్యత ఉండాలి.- సీఎం జగన్
ఇదీ చదవండి:58 శాతం పనులయ్యాయ్: పోలవరంపై సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్ట్
Last Updated : Feb 5, 2020, 12:46 PM IST