అమెరికా జాతి అహంకార దాడులకు వ్యతిరేకంగా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అమెరికా జాతి అహంకార దాడులు ఆపాలని, నల్ల జాతీయులకు రక్షణ కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు డిమాండ్ చేశారు. ఈ రకమైన చర్యలకు వ్యతిరేకంగా అమెరికాలో ప్రజా పోరాటాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
అమెరికాలో నల్ల జాతీయులకు సంఘీభావంగా.. విశాఖలో సీఐటీయూ నిరసన - విశాఖ సీఐటీయూ నిరసన తాజా వార్తలు
అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్పై జరిగిన ఘాతకానికి వ్యతిరేకంగా విశాఖలో సీఐటీయూ నాయకులు తమ నిరసన తెలపారు. అమెరికాలో నల్లజాతీయులకు రక్షణ కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు డిమాండ్ చేశారు.

విశాఖలో సీఐటీయా నిరసన