గతేడాది బడ్జెట్తో పోలిస్తే ఈ సారి బడ్జెట్ సంతృప్తికరంగా ఉందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఛైర్మన్ విజయ్ నాయుడు గల్లా అన్నారు. విశాఖలో ఆయన ఈటీవీ భారత్తో మాట్లాడారు. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించకపోవడం నిరాశజనకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించడం వల్ల ఏపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆదాయ పన్నులను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు పేద, మధ్య తరగతి వారికి ఉపశమనాన్ని కలిగిస్తాయని విజయ్ నాయుడు గల్లా అన్నారు. డివిడెంట్ డిస్ట్రిబ్యూటర్ పన్ను తీసివేయడం వల్ల వ్యాపారులు తమ కంపెనీలను వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్పొరేట్ పన్నులో ఎలాంటి మార్పులు చేయకపోవడం ద్వారా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారు ఎలాంటి సందిగ్ధానికి గురికాకుండా ఉంటారని విజయ్ నాయుడు అభిప్రాయపడ్డారు. బడ్జెట్ను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై సీఐఐ తరఫున కేంద్రానికి నివేదిక పంపే ప్రయత్నం చేస్తామని తెలిపారు.