ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైటెక్ వ్యభిచారంపై రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ దాడులు - ఏపీలోని వివిధ నగరాల్లో ఏకకాలంలో సీఐడీ సైబర్ విభాగం దాడులు

రాష్ట్ర వ్యాప్తంగా గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచారాన్ని.. సీఐడీ సైబర్ విభాగం అధికారులు గుర్తించారు. ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. సంతోష్ అనే ప్రధాన నిందితుడితో సహా కోల్​కతాకు చెందిన యువతిని విశాఖలో అదుపులోకి తీసుకున్నారు.

hi tech prostitution
పోలీసుల అదుపులోని నిందితుడు

By

Published : Dec 6, 2020, 3:56 PM IST

Updated : Dec 6, 2020, 7:08 PM IST

అంతర్జాలం వేదికగా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసులతో కలిసి విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంలో.. ఏక కాలంలో సీఐడీ సైబర్ విభాగ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖలోని ఓ స్టార్ హోటల్‌పై దాడి చేసి.. ప్రధాన నిందితుడు సంతోష్​తో పాటు కోల్‌కతాకు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితులు పవన్, క్రాంతిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

అంతర్జాలం ద్వారా కోల్‌కతా యువతులను విశాఖకు రప్పించి.. ఈ నిందితులు విటులను ఆకర్షిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో సంతోష్​తో పాటు కోల్‌కతాకు చెందిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్నారు. విశాఖ వాసులు పవన్, క్రాంతిలు వారితో కలిసి.. ఈ దందాను నిర్వహిస్తున్నారని తెలిపారు.

Last Updated : Dec 6, 2020, 7:08 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details