ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ ఓడరేవుకు చైనా నౌక... సిబ్బందికి వైద్య పరీక్షలు

కరోనా వైరస్​పై విశాఖ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ ఛైర్మన్‌ పీఎల్ హరనాథ్‌ అన్నారు. చైనా నుంచి విశాఖ ఓడరేవుకు వచ్చిన నౌకలోని సిబ్బందికి పరీక్షలు నిర్వహించాకే అనుమతి ఇస్తామని తెలిపారు.

china ship reached to vishaka
china ship reached to vishaka

By

Published : Mar 7, 2020, 6:55 AM IST

మీడియాతో విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ ఛైర్మన్‌

నౌకామార్గంలో విదేశాల నుంచి వచ్చేవారి ద్వారా కరోనా(కొవిడ్-19) వైరస్ సోకకుండా అన్ని చర్యలు తీసుకున్నామని విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ ఛైర్మన్‌ పీఎల్ హరనాథ్‌ తెలిపారు. కొవిడ్‌ 19 వ్యాప్తి నియంత్రణకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. చైనాలోని జాంగ్​జాంగ్​ ఓడరేవు నుంచి పెట్​కోక్​తో ఫార్ఛ్యూన్​ హీరో అనే నౌక విశాఖ ఓడరేవుకు వచ్చిందని ఆయన వెల్లడించారు. నౌకలోని సిబ్బందిని పూర్తిగా పరీక్షించిన తరువాతనే కార్యకలాపాలకు అనుమతిస్తున్నామని చెప్పారు. వీరిలో 17 మంది చైనా, ఐదుగురు మయన్మార్ దేశానికి చెందిన వారున్నారని తెలిపారు. కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ సూచనల మేరకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, సిబ్బంది కోసం మాస్క్‌లు, గ్లౌజ్, శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచామని హరనాథ్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details