ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

64 గళ్ల ఆటలో మేటి... వెళ్లలేదు దేశ సరిహద్దు దాటి...!

9 ఏళ్లకే 64 గళ్లపై పట్టు బిగించింది. ఎన్నో ఏళ్లు శ్రమిస్తే గాని సాధ్యం కానీ అంతర్జాతీయ స్థాయి హోదాను కైవసం చేసుకుంది. విదేశాల్లో పతకాలు సాధించే సత్తా ఉన్నా... వెళ్లేందుకు మాత్రం ఆర్థికంగా సమస్య ఉంది. ప్రభుత్వమే చొరవ చూపి చిన్నారిని ప్రోత్సహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

నందన

By

Published : Sep 18, 2019, 10:38 AM IST

64 గళ్ల ఆటలో మేటి... వెళ్ల లేదు దేశ సరిహద్దు దాటి...

విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో నివాసముంటున్న రాధాకృష్ణ సంతానమే.. అవినాష్, దేవకీ నందన. చదరంగంపై అవినాష్‌కి ఉన్న ఆసక్తి అలవాటుగా మారింది. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెల్చుకున్నాడు. గమనించిన సోదరి దేవకీనందన చెస్‌ ఆటడం మొదలుపెట్టింది. చిన్నారి ఉత్సాహాన్ని చూసిన తల్లి సరస్వతి... కోచ్ చిరంజీవి వద్ద శిక్షణ ఇప్పించింది. క్రమంగా ఆటపై పట్టు సాధించి పతకాల వేట మొదలుపెట్టిందీ చిచ్చరపిడుగు.

2017లో ఆట ప్రారంభించిన దేవకీనందన 2 నెలలకే జిల్లా స్థాయి పోటీల్లో అండర్ 7 విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. ప్రత్యర్థి ఆట పసిగట్టడంలో దేవకీ నందనకు మంచి పట్టు ఉంది. అటాక్, ఢిఫెన్స్ ఆడడంలో ప్రత్యేకత సాధించింది. 64 గడులపై ఉన్న ఆసక్తే ఆమెను విజేతగా నిలుపుతోంది. అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించి, నిర్విరామంగా సాధన చేస్తోంది. అంతర్జాతీయ పోటీలకు వెళ్లాలంటే ఖర్చు భారీగా ఉంటుందని ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నారు తల్లిదండ్రులు.

ABOUT THE AUTHOR

...view details