విశాఖ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో మృతి చెందిన కెమిస్ట్ గౌరీశంకర్ మూడేళ్ల నుంచి కంపెనీలో పని చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే గౌరీశంకర్‌కు వివాహమైంది. భార్య వెంకటలక్ష్మి ప్రస్తుతం గర్భవతి అని బంధువులు తెలిపారు.
విజయనగరం జిల్లా పూసపాటి రేగకు చెందిన గౌరీశంకర్... పెళ్లైన కొద్ది నెలలకే మృత్యువాతపడడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేస్తోంది. విశాఖ కేజీహెచ్‌లోని మార్చురీ వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.