విశాఖ ఎల్జీ పాలిమర్స్ నుంచి స్వల్ప రసాయన వాసన వచ్చిందని సమీప గ్రామస్థులు పరిశ్రమ వద్దకు వెళ్లి సిబ్బందిని వాకబు చేశారు. సంస్థలోని కొన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తుంటే.. వాటి చర్య వలన రసాయన వాసన వచ్చిందని రక్షణ సిబ్బంది చెప్పారు. దీంతో గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎల్జీ పాలిమర్స్ నుంచి రసాయన వాసన..వాకబు చేసిన గ్రామస్థులు - విశాఖపట్నం తాజా వార్తలు
విశాఖ వెంకటాపురం గ్రామస్థులకు స్వల్ప రసాయన వాసనలు రావడం వల్ల ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు వెళ్లి వివరాలు అడిగారు. సంస్థలోని కొన్ని యంత్రాలు, వస్తువులను శుభ్రం చేస్తున్నందున కొంత రసాయన వచ్చిందని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడం వల్ల గ్రామస్థులు వెనుదిరిగారు.
![ఎల్జీ పాలిమర్స్ నుంచి రసాయన వాసన..వాకబు చేసిన గ్రామస్థులు chemical smell came to venkatapuram village people because of cleaning instruments says security people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7922888-681-7922888-1594093234062.jpg)
ఆందోళన చెందిన వెంకటాపురం గ్రామస్థులు