సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో ఆధునీకీకరణ పనులు చేపట్టిన నేపథ్యంలో అధికారులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి వాటి సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దు - railway latest news
వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలోని పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో ఆధునీకీకరణ పనులు జరగటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. సంబంధిత వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.
ఈ నెల 19న పూరీ-యశ్వంత్‌పూర్(02063) వారాంతపు ప్రత్యేక రైలు, 20న యశ్వంత్‌పూర్-పూరీ(02064) ప్రత్యేక వారాంతపు ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. 11 నుంచి 23 వరకు... భువనేశ్వర్- కేఎస్‌ఆర్ బెంగళూర్(08463) ప్రత్యేక రైలు సత్యసాయి ప్రశాంతి నిలయం వరకు, 12 నుంచి 24 వరకు.. కేఎస్‌ఆర్ బెంగళూర్-భువనేశ్వర్(08464) ప్రత్యేక రైలు సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి బయల్దేరుతాయన్నారు. పలు పార్సిల్ రైళ్లను ధర్మవరం, అనంతపురం బైపాస్ మార్గంలో దారి మళ్లించి నడపనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఆయా రైళ్ల సమాచారాన్ని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.
ఇదీ చదవండి
పంచాయతీ ఎన్నికలపై.. ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్: ఎస్‌ఈసీ