విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్న చంద్రబాబు దుర్ఘటనపై సత్వరమే స్పందించి చర్యలు చేపట్టినందుకు ప్రధానికి అభినందనలు తెలిపారు. గ్యాస్ లీకేజిపై విచారణకు సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. విషవాయువు విడుదలకు దారితీసిన అంశాలపై దర్యాప్తు చేయించాలన్నారు.
విశాఖ ఘటనపై సమగ్ర దర్యాపు జరపాలి : చంద్రబాబు - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని.. ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గ్యాస్ లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లీకైనా స్టైరీన్‌తో పాటు ఇతర వాయువులు ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయన్న చంద్రబాబు.. దుర్ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు తెలుస్తాయన్నారు.
లీకైన వాయువు స్టైరీన్ అని కంపెనీ చెబుతుందని...స్టైరీన్‌తో పాటు మరికొన్ని వాయువులు ఉన్నాయని భిన్న నివేదికలున్నాయన్నారు. విషవాయువులు బాధితులకు శాశ్వత నష్టం చేస్తాయని, విశాఖ పరిసరాల్లో గాలి నాణ్యతను పరిశీలిస్తేనే భవిష్యత్తులో ప్రభావాలను అంచనా వేయగలమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజల ఆరోగ్యం పై అధ్యయనానికి జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణలను రంగంలోకి దించి తదనుగుణంగా తక్షణ, దీర్ఘకాలిక వైద్య చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు. బాధితులకు సరైన పరిహారం అందేలా ఈ అంచనాలు తోడ్పడతాయన్నారు.
ఇవీ చదవండి...విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు...!