ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు, రేపు విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన - 10,11న విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన

తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. స్వల్ప విరామం అనంతరం...తిరిగి జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాలవారీగా పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన ఆయన.. ఈ నెలలో 3 జిల్లాలను చుట్టిరానున్నారు. వారానికి ఒక్కో జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు... రెండురోజులపాటు జిల్లాలో ఉండి ప్రతి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై సమీక్షించనున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా నేటి నుంచి రెండ్రోజుల పాటు విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగనుంది.

నేడు, రేపు విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన

By

Published : Oct 10, 2019, 6:27 AM IST

నేడు, రేపు విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన
తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నేటి నుంచి రెండ్రోజుల పాటు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల తెదేపా నేతలతో విడివిడిగా సమీక్ష చేసి, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కేవలం 4 స్థానాల్లో మాత్రమే గెలిచింది. చంద్రబాబు తొలిరోజు పర్యటనలో భాగంగా ఒక్కో నియోజకవర్గానికీ అరగంటపాటు సమయం కేటాయిస్తూ నేతలందరితోనూ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల వారీ సమీక్షలకన్నా ముందు జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.


జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి

విశాఖ జిల్లా పర్యటన అనంతరం ప్రతివారం ఒక్కో జిల్లాలో రెండు రోజులపాటు చంద్రబాబు పర్యటన ఉండేలా తెదేపా ప్రణాళిక సిద్ధం చేసింది. చంద్రబాబు..జిల్లా కేంద్రంలో 2 రోజులపాటు మకాం వేసి నేతలు, కార్యకర్తలను స్వయంగా కలవనున్నారు. ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి సారించనున్నారు. జిల్లాలో అనుబంధ సంఘాల బలోపేతం, సామాజిక న్యాయంతో పార్టీ పటిష్ఠం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అన్నివర్గాలను సమన్వయం చేసుకుని.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన పోరాటాలపైనా జిల్లా నేతలకు తెదేపా అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చేవారం నెల్లూరు, పైవచ్చేవారం.. శ్రీకాకుళం జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలు ఉండే అవకాశం ఉంది.

ఇదీ చదవండి :ఈనెల 10, 11 తేదీల్లో చంద్రబాబు విశాఖ పర్యటన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details