ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో చంద్రబాబు వాహనశ్రేణిని అడ్డుకున్న వైకాపా - చంద్రబాబు కాన్వాయ్ పై వైకాపా దాడి

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం వైకాపా శ్రేణులు.. వీరంగం సృష్టించాయి. చంద్రబాబును ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఆయన వాహన శ్రేణిపై కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరారు.

chandrababu-visit-vishaka
chandrababu-visit-vishaka

By

Published : Feb 27, 2020, 12:48 PM IST

Updated : Feb 27, 2020, 11:09 PM IST

విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విమానాశ్రయం వద్ద వైకాపా కార్యకర్తల తీరుతో ప్రజలు భీతిల్లారు. చంద్రబాబును అడ్డుకునేందుకు పలుచోట్ల నుంచి కార్యకర్తలను వైకాపా సమీకరించింది. మాజీ సీఎం చంద్రబాబు వాహనశ్రేణిపై వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించారు. కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరారు. విమానాశ్రయం నుంచి బయటకు రానీయకుండా అడ్డుకునేందుకు వైకాపా కార్యకర్తలు విశ్వ ప్రయత్నం చేశారు.

చంద్రబాబు కాన్వాయ్‌ ఎదుట బైఠాయించి వైకాపా శ్రేణుల నినాదాలు చేశారు. ఫలితంగా.. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రయాణికులను వేరే వాహనాల్లో పోలీసులు తరలిస్తున్నారు. విశాఖ ఎన్‌ఏడీ కూడలి నుంచి ఎయిర్‌పోర్టు మార్గంలో ప్రజల అవస్థలు పడుతున్నారు. వైకాపా కార్యకర్తల నిరసన కారణంగా విశాఖలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తెదేపా కార్యకర్తలను విమానాశ్రయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

Last Updated : Feb 27, 2020, 11:09 PM IST

ABOUT THE AUTHOR

...view details