ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాహనం దిగి నడుస్తూ వెళ్లిన చంద్రబాబు భద్రత దృష్ట్యా తిరిగి...!

వైకాపా శ్రేణుల వీరంగంతో విశాఖ ఉడుకుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాకను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పరిస్థితి రణరంగమైంది. వేలాదిగా తరలివచ్చిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి... కొన్ని గంటలుగా చంద్రబాబు వాహనశ్రేణి ముందుకు కదలకుండా స్తంభింపజేశారు. ఈ క్రమంలో వాహనం దిగి నడుస్తూ చంద్రబాబు ముందుకు కదిలారు.

babu padayatra
babu padayatra

By

Published : Feb 27, 2020, 1:00 PM IST

Updated : Feb 27, 2020, 3:46 PM IST

కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో వాహనం దిగి పాదయాత్రగా చంద్రబాబు

విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు కాన్వాయ్‌ను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. అత్యంత ఉద్రిక్త పరిస్థితులే మధ్యే చాలాసేపు వాహనంలో వేచి చూసిన చంద్రబాబు.... పరిస్థితి ఎంతకీ సద్దుమణకపోవడం వల్ల ఇక లాభం లేదనుకుని కిందకు దిగారు. పాదయాత్రగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతా కారణాల దృష్ట్యా మళ్లీ వాహనం ఎక్కారు. వాహనంలో ఉన్న చంద్రబాబుతో పోలీసులు మాట్లాడారు. తెదేపా, వైకాపా కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, తోపులాట కొనసాగుతోంది. కాన్వాయ్‌ ఎదుట బైఠాయించేందుకు వైకాపా నేత కె.కె.రాజు యత్నించారు. చంద్రబాబు కాన్వాయ్‌ను కదలనీయకుండా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ‌వాహనం ఎదుట నల్లజెండాలతో ప్రదర్శన చేశారు.

Last Updated : Feb 27, 2020, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details