ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరోగ్య విపత్తు తలెత్తే ప్రమాదం: చంద్రబాబు - వైసీపీపై చంద్రబాబు కామెంట్స్

ప్రజారోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. విశాఖలో కొవిడ్ బాధితులందర్నీ ఒకే బస్సులో కుక్కి కుక్కి ఎక్కించిన వీడియోను ట్వీట్ చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తే ప్రమాదం ఉందని ఆక్షేపించారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Jul 23, 2020, 4:51 PM IST

చంద్రబాబు ట్వీట్

కర్నూలు జిల్లాలో కరోనా బాధితులను ఒకే అంబులెన్స్‌లో తరలించిన సంఘటన మరువక ముందే విశాఖలో మరో ఘటన వెలుగు చూసిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖలో కొవిడ్ బాధితులను ఆర్టీసీ బస్సులో కుక్కి పంపారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటుందని నిలదీశారు. ఏపీలో అతి పెద్ద ఆరోగ్య విపత్తు తలెత్తే ప్రమాదం ఉందనటానికి ఇదో హెచ్చరిక అన్న చంద్రబాబు... వీడియో చూసి విస్తుపోవాల్సిందే అంటూ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details