ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 23, 2021, 6:01 PM IST

ETV Bharat / city

visakha steel plant: రాజీనామాకు తెదేపా ప్రజాప్రతినిధులు సిద్ధం: చంద్రబాబు

'విశాఖ ఉక్కు' ఉద్యమాన్ని సీఎం జగన్ ముందుండి నడిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఐక్య పోరాటం వల్లే ఉక్కును ప్రైవేటీకరించకుండా కాపాడగలమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 'విశాఖ ఉక్కు' కోసం రాజీనామాకు తెదేపా ప్రజాప్రతినిధులు సిద్ధమన్నారు.

chandra babu wrote letter to Visakhapatnam Steel Industry Conservation Committee
chandra babu wrote letter to Visakhapatnam Steel Industry Conservation Committee

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 'విశాఖ ఉక్కు' కోసం రాజీనామాకు తెదేపా ప్రజాప్రతినిధులు సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి సంపూర్ణ మద్దతిస్తామన్నారు. 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదం'తో ప్లాంట్ సాధించారని.. ఎన్నో ఆటంకాలు దాటి 1992లో ప్లాంట్‌ను దేశానికి అంకితం చేశారని గుర్తు చేశారు.

'2000 సంవత్సరంలో నాటి వాజ్ పేయి ప్రభుత్వం రూ.4 వేల కోట్లకు ప్రైవేటీకరించేందుకు సిద్ధపడింది. నా అభ్యర్థన, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ప్రైవేటీకరణ ఆలోచన విరమింపజేయటంతో పాటు భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ రూ.1,333 కోట్లతో తిరిగి లాభాలబాట పట్టేలా చేశాం. 'విశాఖ ఉక్కు' పరిరక్షణకు సీఎం జగన్‌ నేతృత్వం వహించాలి. 'విశాఖ ఉక్కు' ఉద్యమాన్ని సీఎం జగన్ ముందుండి నడిపించాలి. ఐక్య పోరాటం వల్లే ఉక్కును ప్రైవేటీకరించకుండా కాపాడగలం'.- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:

vishaka steel plant: 'కౌంటర్ దాఖలులో కేంద్రం ఆలస్యం చేస్తోంది'

ABOUT THE AUTHOR

...view details