Chandanotsavam: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం వైభవంగా సాగుతోంది. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారికి తొలి చందనం సమర్పించారు. కుటుంబసమేతంగా అశోక్‌గజపతిరాజు అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టువస్త్రాలు అందజేశారు. చందనోత్సవం సందర్భంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు సత్యనారాయణ చెప్పారు. సింహాచలం దేవస్థాన అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పూర్తయిందన్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, స్పీకర్ తమ్మినేని సీతారామ్ అప్పన్నను దర్శించుకున్నారు. అప్పన్న చందనోత్సవానికి తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ సింహాచల అప్పన్న దర్శనం చేసుకున్నారు. సింహాద్రి అప్పన్న తమ ఇంటి ఇలవేల్పుగా చెప్పారు. ఆ స్వామి అనుగ్రహం ఈ రాష్ట్రంపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. లైన్లో ఉన్న చివరి భక్తుడు వరకు చక్కటి దర్శనం కల్పిస్తామని తెలిపారు.