ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏయూ గాంధీయన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్‌గా చల్లా రామకృష్ణ - గాంధీయన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్‌గా చల్లా రామకృష్ణ నియామకం

ఆంధ్రా యూనివర్సిటీ(AU) గాంధీయన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్‌గా బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఛైర్మన్​ డాక్టర్ చల్లా రామకృష్ణ నియమితులయ్యారు. అసిస్టెంట్ ప్రిన్సిపల్, డిపార్ట్‌మెంట్ హెడ్, ఏయూ రీసెర్చ్ ఫోరమ్ కో-కన్వీనర్‌గా ఆయన పనిచేశారు.

Challa ramakrishana
Challa ramakrishana

By

Published : Jun 25, 2022, 6:54 PM IST

బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్​కమ్యూనికేషన్ ఛైర్మన్​ డాక్టర్ చల్లా రామకృష్ణ.. ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ) గాంధీయన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి సమక్షంలో రామకృష్ణకు రిజిస్ట్రార్‌ అందజేశారు.

డాక్టర్ రామకృష్ణ అసిస్టెంట్ ప్రిన్సిపల్, డిపార్ట్‌మెంట్ హెడ్, ఏయూ రీసెర్చ్ ఫోరమ్ కో-కన్వీనర్‌గా వివిధ పదవులు నిర్వహించారు. డాక్టర్ రామకృష్ణ వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్స్, అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ యూనివర్శిటీస్ పీఆర్​, మార్కెటింగ్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సభ్యుడు. 15 పీహెచ్‌డీలకు రామకృష్ణ మార్గదర్శకత్వం వహించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details