అవగాహన పెంపొందించుకుని పసిగట్టినట్లయితే.. మహిళల్లో రొమ్ము కేన్సర్‌ను పూర్తిగా జయించే అవకాశం ఉందని 'చైతన్య స్రవంతి' స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయంపై అవగాహన కోసం విశాఖ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక దశలో గుర్తించడం వల్ల కేన్సర్ నుంచి బయటపడి.. ఆరోగ్యంగా జీవించవచ్చని సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ షిరీన్ రెహ్మాన్ పేర్కొన్నారు. వైద్యుల సూచనల ద్వారా.. మహిళలే సొంతగా వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందన్నారు.
రొమ్ము కేన్సర్‌పై 'చైతన్య స్రవంతి' అవగాహన ర్యాలీ - రొమ్ము కాన్సర్పై అవగాహన ర్యాలీలో చైతన్య స్రవంతి అధ్యక్షురాలు షిరీన్ రెహ్మాన్
రొమ్ము కేన్సర్‌పై మహిళలకు అహగాహన కల్పించేందుకు.. చైతన్య స్రవంతి అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. విశాఖ నగరంలో సంస్థ ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొన్ని లక్షణాలను ముందుగా గుర్తిస్తే.. కేన్సర్ ముప్పు నుంచి బయటపడవచ్చని సంస్థ అధ్యక్షురాలు తెలిపారు.
![రొమ్ము కేన్సర్‌పై 'చైతన్య స్రవంతి' అవగాహన ర్యాలీ breast cancer awareness](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9383630-134-9383630-1604156331456.jpg)
రొమ్ము కాన్సర్పై అవగాహన ర్యాలీ