కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలి: షికావర్ధన్ - విశాఖలో కరోనా చర్యలు న్యూస్
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా... దిల్లీలోని జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ నుంచి ముగ్గురు వైద్యుల బృందం విశాఖ చేరుకుంది. డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్.షికా వర్ధన్ నేతృత్వంలో విశాఖలో ఈ బృందం పర్యటిస్తుంది. విశాఖ ఎయిర్పోర్ట్లో కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలను బృందం పరిశీలించింది. కరోనా విషయంలో నివారణ ప్రధాన మార్గమన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే ఈ వైరస్ బారిన పడకుండా చూడగలమని చెప్తున్నారు. జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ, డిప్యూటీ డైరెక్టర్ షికా వర్ధన్తో 'ఈటీవీభారత్' ముఖాముఖి.
'అవగాహనతోనే కరోనా బారిన పడకుండా చూడగలం'