ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kishan reddy on Cruise Touirsm: 'ఉపాధి కల్పించే రంగాల్లో పర్యాటకానిదే తొలిస్థానం' - tourism minister of india

పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్ విండో పద్థతిలో అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నామని(Kishan reddy on Cruise Touirsm) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విశాఖలో పర్యటించిన ఆయన.. బావికొండ వద్ద నిర్మిస్తున్న బుద్ధిస్టు కాంప్లెక్స్‌(Kishan reddy visted Buddhist Complex at Bavikonda) పనులను పరిశీలించారు. దేశంలో ఉపాధి కల్పించే రంగాల్లో పర్యాటకానిది తొలి స్థానమని అన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
central minister kishan reddy

By

Published : Nov 23, 2021, 6:55 PM IST

దేశంలో అతిపెద్ద ఉపాధి కల్పించే రంగాల్లో పర్యాటకానిది తొలి స్ధానమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy on tourism employment) అన్నారు. అలాంటి రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఫలితంగా పలు పన్నురాయితీలు లభిస్తాయన్నారు. ఇతర భారాలు తగ్గి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో పెట్టుబడులు, కొత్త అలోచనలు చేసేందుకు వీలవుతుందన్నారు. విశాఖలో ఒక రోజు పర్యటనకు వచ్చిన ఆయన.. మంత్రి అవంతితో కలిసి క్రూయిజ్ టూరిజం(Kishan reddy on Cruise Touirsm)పై పోర్టు అధికారులతో సమీక్షించారు. దేశంలో 97 మేనేజ్​మెంట్‌ సంస్థలు టూరిజంలో ఉన్నాయని, వీటన్నింటిని సమన్వయం చేసి ఒక టూరిజం విశ్వవిద్యాలయంగా తీసుకురావాలని అలోచిస్తున్నట్టు పేర్కొన్నారు.

పర్యాటకంపై ఆధారపడ్డ పలు దేశాలు కరోనా కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని(corona impact on Touirsm).. మన దేశంలో అలాంటి సమస్య లేదన్నారు. పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్ విండో పద్థతిలో అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నామని వివరించారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా ఉందన్నారు. విశాఖ పోర్టుతో మిగిలిన శాఖలను సమన్వయం చేసి వేగంగా పర్యాటక అంశాలను పట్టాలెక్కించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details