ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'గత ఐదేళ్ల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్​కు రూ.7,866కోట్లు నష్టం'

విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు లేక ఖనిజాన్ని బహిరంగ విపణి నుంచి కొనుగోలు చేస్తోందని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. ఇనుప ఖనిజం గనులను ఆర్ఐఎన్​ఎల్​కు కేటాయించాలని ఒడిశా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో పన్ను చెల్లింపుల తర్వాత వైజాగ్ స్టీల్​కు రూ.7,866కోట్లు నష్టం వచ్చినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

'గత అయిదేళ్ల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్​కు రూ.7,866కోట్లు నష్టం'
'గత అయిదేళ్ల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్​కు రూ.7,866కోట్లు నష్టం'

By

Published : Mar 10, 2021, 10:59 PM IST

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకు సొంత గనులు లేక ఇనుప ఖనిజాన్ని బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తోందని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ అన్నారు. రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు. ఇనుప ఖనిజం గనులను ఆర్ఐఎన్ఎల్​కు కేటాయించాలని కోరుతూ... ఉక్కు శాఖ తరఫున ఒడిశా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్​లో సెంట్రల్ డిస్పాచ్ యార్డ్ నిర్మాణం పూర్తయ్యిందని.. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ చేస్తున్న ఉత్పత్తికి తగ్గట్టు రోడ్డు, రైలు మార్గంలో సరకు రవాణా జరుగుతున్నట్లు భాజపా ఎంపీ సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ధర్మేంద్ర సమాధానం చెప్పారు.

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా గత అయిదేళ్లలో మూడేళ్లపాటు నష్టాలు మూటగట్టుకోగా.. వైజాగ్ స్టీల్ నాలుగేళ్ల పాటు నష్టాల్లో నడిచిందని కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ ఐదేళ్ల కాలంలో పన్ను చెల్లింపు తర్వాత సెయిల్​కు రూ.3,135 కోట్లు, వైజాగ్ స్టీల్​కు రూ.7,866 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు.

ఇదీచదవండి.

రాష్ట్ర మాజీ మంత్రి పిటిషన్​పై సుప్రీంలో విచారణ

ABOUT THE AUTHOR

...view details