ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Visakha Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయటం కుదరదు: కేంద్రం - Visakha Steel Plant

Vizag Steel: సెయిల్‌లో విశాఖ స్టీల్‌ ప్లాంటు విలీనానికి అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. స్టీల్‌ ప్లాంటు పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు, ఆర్థిక మంత్రిత్వశాఖలు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చాయి.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయటం కుదరదు
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయటం కుదరదు

By

Published : Aug 2, 2022, 8:02 PM IST

Central Govt On Visakha Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను (Visakha Steel Plant) సెయిల్‌లో (SAIL) విలీనం చేయటం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ (BJP MP GVL) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు, ఆర్థిక మంత్రిత్వశాఖలు (Ministry of Steel and Finance) లిఖితపూర్వక సమాధానం ఇచ్చాయి. స్టీల్‌ ప్లాంటు పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం (Central Govt) వెల్లడించింది.

ఉక్కు వ్యూహాత్మక రంగం కాదని.. సెయిల్‌లో విశాఖ స్టీల్‌ ప్లాంటు విలీనానికి అవకాశం లేదని తెలిపింది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టీల్‌ ప్లాంటు విలీనం చేయటానికి అవకాశం లేదని పేర్కొంది. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details