స్మార్ట్ విశాఖ నిధులు రూ. 186 కోట్లు విడుదల - విశాఖకు కేంద్ర నిధులు విడుదల
విశాఖ అభివృద్ధికి కేంద్రం రూ. 186 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మొత్తం జీవీఎస్సీ కార్పొరేషన్ లిమిటెడ్ పీడీ ఖాతాకు జమయ్యాయి.
విశాఖ
స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్టు కింద విశాఖ నగరానికి కేంద్ర ప్రభుత్వం 186 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన పీడీ ఖాతాకు ఈ మొత్తాన్ని జమ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్ సిటీ మిషన్ కింద విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది.