ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'భవిష్యత్తులో భాజపానే కీలక పార్టీ' - విశాఖలో కేంద్ర మాజీ మంత్రి సురేష్​ ప్రభు పర్యటన

ఏపీలో భాజపా త్వరలో పట్టు సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి సురేష్​ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం పట్ల కేంద్రానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్లు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశంలో ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు లబ్ది చేకూరుతున్నాయని వివరించారు.

'భవిష్యత్తులో భాజపానే కీలక పార్టీ'

By

Published : Nov 3, 2019, 6:43 AM IST

భవిష్యత్తులో భాజపానే కీలక పార్టీగా రాష్ట్రంలో అవతరిస్తుందని కేంద్ర మాజీ మంత్రి సురేష్​ ప్రభు జోస్యం చెప్పారు. ప్రజా లబ్ధి చేకూర్చే పథకాలను ఈ రాష్ట్రంలోనూ అమలు చేస్తామన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశ వ్యాప్తంగా వేలాది మంది 'ఆయుష్మాన్​ భారత్​' పథకంలో లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. వారంతా తమ నేతలను కలిసి కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్​ భారత్​ను వైఎస్సార్​ ఆరోగ్య శ్రీగా మార్చి ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. ముద్ర , ఉజ్వల, కిసాన్​ యోజన లాంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్రం పట్ల కేంద్రానికి ప్రత్యేక దృష్టి ఉందన్నారు. విశాఖకు రైల్వే జోన్​ ప్రకటించే సమయంలో ఆయన రైల్వే మంత్రిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రం కంటే.. ఎక్కువ సహకారం ఆంధ్రప్రదేశ్​కు దక్కుతోందని విశాఖలో సురేష్​ ప్రభు వ్యాఖ్యానించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details