ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 2, 2020, 7:27 AM IST

ETV Bharat / city

పట్టాలెక్కని ‘మెట్రో’!

మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనలు కొలిక్కి రాకపోవడంతో కేంద్రం నుంచి రావలసిన సాయం అందని ద్రాక్షే అవుతోంది. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో కొన్ని చిన్న రాష్ట్రాలకు మెట్రో ప్రాజెక్టులకు విదేశీ సాయం కింద కేటాయింపులు చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా ఇప్పటికీ రాష్ట్రం నుంచి మెట్రో ప్రాజెక్టులు ప్రతిపాదనల దశ కూడా దాటకపోవడంతో కేంద్రం నుంచి మరోసారి చుక్కెదురైంది.

central budget
central budget

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద విశాఖలో మొదట 43 కిలో మీటర్లలో మెట్రోరైలు ప్రాజెక్టు కోసం ప్రతిపాదించారు. తాజాగా మళ్లీ 140 కిలో మీటర్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి మార్పుల కారణంగా మెట్రో ప్రాజెక్టుకు ఇప్పటికీ ముందడుగు పడలేదు. విజయవాడలో ప్రతిపాదిత మెట్రో రైలు ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇంతే. మొదట 26 కిలో మీటర్ల పొడవునా రూ.6 వేల కోట్లతో మెట్రో ప్రాజెక్టుకి ప్రతిపాదనలు తయారయ్యాయి. ఈలోగా కేంద్ర ప్రభుత్వ విధానం మారడంతో వీటిని పక్కన పెట్టి 80 కిలో మీటర్లలో రూ.24 వేల కోట్లతో లైట్‌ మెట్రోని ప్రతిపాదించారు. చివరకు ఏదీ తేల్చకుండానే ఐదేళ్లు గడిచిపోయాయి. ప్రభుత్వం తాజాగా విజయవాడ మెట్రోపై సమీక్షలో మరోసారి సమగ్ర ప్రతిపాదనలతో రావాలని అధికారులను ఆదేశించింది. దీంతో అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు వెళ్లలేదు.

ABOUT THE AUTHOR

...view details