విశాఖ స్టీల్ ప్లాంట్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ ఇండస్ట్రీ 4.0ను మంజూరు చేస్తూ కేంద్రం ప్రభుత్త్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20.45 కోట్ల వ్యయంతో దీన్ని నెలకొల్పనున్నారు.
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కు.. "సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఇండస్ట్రీ 4.0" మంజూరు
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఇండస్ట్రీ 4.0" ను కేంద్రం ప్రభుత్త్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో.. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ 8.32 కోట్ల రూపాయలు, సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్.టి.పి. ఐ.) కోటి రూపాయలు, స్టీల్ ప్లాంట్ రూ.9 కోట్లు కేటాయిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా విడుదల చేయనుంది. దీని ద్వారా.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేయడం.. వృత్తి నిపుణులకు శిక్షణ ఇవ్వడం వంటివి విస్తృతంగా చేపడతారు.
ఇదీ చదవండి : VAISAKHA PORT : సాగర తీరాన సమరోత్సాహం.. అమెరికా యుద్ధ నౌకావిన్యాసాలు