visakha steel plant: స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే విషయంలో పునరాలోచన లేదు: కేంద్రం - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వార్తలు
solar tenders cases
20:26 July 20
visakha steel plant
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే విషయంలో పునరాలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. నూటికి నూరు శాతం ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించింది. తెదేపా ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రమంత్రి భగవత్ కిషన్‌రావు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రైవేటీకరణపై తుది నిర్ణయానికి వచ్చినందున ఇకపై చెప్పేదేమీ లేదని పేర్కొన్నారు. ఉద్యోగులు, వాటాదారుల చట్టబద్ధమైన అంశాలన్నీ పరిష్కరిస్తామని వివరించింది.
ఇదీ చదవండి
Last Updated : Jul 20, 2021, 10:13 PM IST