విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... తెదేపా విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చేస్తున్న పోరాటం ఆదర్శనీయమని చంద్రబాబు కొనియాడారు. పల్లా శ్రీనివాస్ సతీమణికి ఫోన్ చేసిన చంద్రబాబు... ధైర్యంగా ఉండాలని చెప్పారు. వైకాపా నేతలు ఒత్తిడి చేసినా... తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కు కోసం ధైర్యంగా, నిజాయతీగా పల్లా శ్రీనివాస్ పోరాడుతున్నారని ప్రశంసించారు. దశాబ్ధాలుగా పోరాడి సాధించుకున్న పరిశ్రమను కాపాడుకోటం అందరి బాధ్యతని పేర్కొన్నారు. శ్రీనివాసరావు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పల్లా శ్రీనివాసరావు పోరాటం ఆదర్శనీయం: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. పల్లా శ్రీనివాసరావు చేస్తున్న పోరాటం ఆదర్శనీయమని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పల్లా సతీమణికి ఫోన్ చేసిన చంద్రబాబు... పల్లా ఆమరణ దీక్షకు అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు.
పల్లా శ్రీనివాసరావు పోరాటం ఆదర్శనీయం