నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సుధాకర్ తల్లి కావేరి బాయిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం సీబీఐ కార్యాలయంలో సుధాకర్ పెద్ద కుమారుడు లలిత్‌ను సీబీఐ బృందం విచారించింది. సుధాకర్‌కు సంబంధించి రెండు నెలలుగా ఎదురైన పరిస్థితుల గురించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
రెండు నెలలుగా సుధాకర్ పరిస్థితిపై సీబీఐ ఆరా - డా సుధాకర్ కేసులో లెటెస్ట్ అప్డేట్స్
మానసిక వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. గత రెండు నెలలుగా డా.సుధాకర్‌కు ఎదురైన పరిస్థితులపై కుటుంబ సభ్యుల నుంచి సీబీఐ వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే సుధాకర్‌ను అరెస్టు చేసిన ప్రాంతం, విశాఖ 4వ పట్టణ పోలీసు స్టేషన్లను సీబీఐ అధికారులు పరిశీలించారు.

రెండు నెలలుగా సుధాకర్ పరిస్థితిపై సీబీఐ ఆరా
గత నెల 16న వివాదం తలెత్తిన ఘటనా స్థలాన్ని సైతం సీబీఐ అధికారులు ఇప్పటికే పరిశీలించారు. అనంతరం సుధాకర్‌ను తీసుకువెళ్లిన 4వ పట్టణ పోలీసు స్టేషన్, కేజీహెచ్‌లో విచారణ జరిపారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు.
ఇదీ చదవండి :విజయవాడ గ్యాంగ్ వార్: వెలుగులోకి కీలక అంశాలు