విమ్స్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మరణించిన మహిళ మెడలో.. మూడు తులాల బంగారు గొలుసు మాయమైందంటూ ఆమె కుటుంబ సభ్యులు విశాఖలోని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి క్రైం ఎస్సై శివ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలికి చెందిన దినకాల వసుంధర కరోనాతో ఈనె ఆరో తేదీన మృతి చెందారు. భౌతికదేహం అప్పగించినపుడు మెడలో బంగారు గొలుసు కనిపించలేదు. విమ్స్ హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:అత్యాచారానికి గురై కరోనా రోగి మృతి!