ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VAISAKHA PORT : సాగర తీరాన సమరోత్సాహం.. అమెరికా యుద్ధ నౌకావిన్యాసాలు - విశాఖ న్యూస్

బంగాళాఖాతంలో అమెరికా నౌకాద‌ళం నిర్వహిస్తున్న‌ యుద్ధవిన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. మ‌ల‌బార్ రెండోద‌శ విన్యాసాల్లో భాగంగా అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు సంయుక్తంగా విన్యాసాలు నిర్వ‌హిస్తున్నాయి. ఆయా విన్యాసాల్లో అమెరికా దేశానికి చెందిన భారీ విమాన వాహక యుద్ధ నౌక యు.ఎస్.ఎస్ కార్ల్ విన్స‌న్ ప్రధానాకర్షణగా నిలుస్తోంది.

carl vinson ship
carl vinson ship

By

Published : Oct 15, 2021, 9:09 AM IST

Updated : Oct 15, 2021, 9:34 AM IST

విశాఖ తీరంలో అబ్బుర పరిచిన అమెరికా యుద్ధ నౌకావిన్యాసాలు

అతి పెద్ద యుద్ధ నౌక.. దానిపై భారీ యుద్ధ విమానాలు.. ఎప్పుడైనా శత్రువులపై దాడికి సై అనేలా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండే వేలాది సైనికులు.. ఇవీ అమెరికా యుద్ధ విమాన వాహక నౌక కార్ల్‌ విన్సన్‌లోని ప్రత్యేకతలు. బంగాళాఖాతంలో గురువారం నిర్వహించిన యుద్ధవిన్యాసాలు అబ్బురపరిచాయి. మలబార్‌ రెండో దశ విన్యాసాల్లో భాగంగా.. ఈ నెల 11వ తేదీ నుంచి భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు విశాఖ తీరానికి సమీపంలో యుద్ధవిన్యాసాలు నిర్వహిస్తున్నాయి.

అమెరికాకు చెందిన విమాన వాహక యుద్ధనౌక యు.ఎస్‌.ఎస్‌.కార్ల్‌విన్సన్‌ (సి.వి.ఎన్‌.-70) విన్యాసాల్లో ప్రధానాకర్షణగా నిలిచింది. దీనిపైనుంచి అధునాతన యుద్ధవిమానాలు ఒక్కసారిగా పైకి ఎగిరిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. 90 యుద్ధవిమానాలు, హెలీకాప్టర్లు కార్ల్‌విన్సన్‌ యుద్ధనౌకపై పట్టే అవకాశం ఉన్నా.. ప్రస్తుతం 72 మాత్రమే విశాఖకు తీసుకువచ్చారు. సుమారు ఐదువేల మంది ఉద్యోగులు వచ్చారు. వీరిలో దాదాపు 900 మంది మహిళా నేవీ సిబ్బంది ఉన్నారు. వారికి కావాల్సిన ఆహారపదార్థాలన్నీ అందులోనే ఉంటాయి.

జిమ్‌, ఆసుపత్రి, ఇతరత్రా ఎన్నో సౌకర్యాలు కూడా అందులోనే సమకూర్చారు. దాదాపు పది అంతస్తులుగా ఉంటుంది. మరెన్నో విశేషాలున్న ఈ నౌకకు.. ‘తేలియాడే నగరం’గా కూడా పేరుంది. విశేష సామర్థ్యం కల ఈ సూపర్‌ కారియర్‌ గత జనవరి నుంచి మిలియన్‌ గ్యాలన్ల ఇంధనాన్ని ఇతర నౌకలకు సరఫరా చేసి రికార్డు సృష్టించింది. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌సింగ్‌, అమెరికా నౌకాదళ ఆపరేషన్స్‌ విభాగం అధిపతి మైక్‌ గిల్డే, తూర్పునౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ ఏబీ సింగ్‌, తదితర అత్యున్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.

సముద్ర మార్గాలపై ఎవరి ఆధిపత్యమూ ఉండకూడదు..
‘ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జలాల్లో అన్ని దేశాల వారూ స్వేచ్ఛగా వ్యాపారం, వాణిజ్యం చేసుకునేలా రాకపోకలు సాగాలి. దానికి భిన్నంగా సముద్రంలోని కొన్ని ప్రాంతాలపై పట్టుసాధించాలన్న ధోరణి మంచిది కాదు. ఎవరి ఆధిపత్యమూ ఇక్కడ ఉండకూడదు. స్వేచ్ఛగా రాకపోకలు సాగించే పరిస్థితి ఉండేలా మా వంతు కృషిచేస్తున్నాం’ - అమెరికా నౌకాదళ ఆపరేషన్స్‌ విభాగం అధిపతి మైక్‌ గిల్డే

25వ ఎడిషన్‌కు మలబార్‌ విన్యాసాలు..
అమెరికా నౌకాదళంతో మలబార్‌ విన్యాసాలను నిర్వహించడాన్ని భారతదేశం 1992లో ప్రారంభించింది. ఆ తరువాత ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు కూడా భాగస్వాములుగా మారాయి. నాలుగుదేశాల నౌకాదళాలు పరస్పర సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 25వ విడత విన్యాసాలు(25వ ఎడిషన్‌) నిర్వహించడం గర్వకారణం’

Last Updated : Oct 15, 2021, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details