విశాఖలో యువకుడి దాడిలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న బాధితురాలు ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ.. జోన్ 3 టౌన్ లెవెల్ ఫెడరేషన్ (టీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. నగరంలోని వన్ టౌన్ ప్రాంతం 39వ వార్డులో సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, ఆర్పీలు, వైకాపా కార్యకర్తలు ర్యాలీ చేశారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా 'సేవ్ ఉమెన్,' 'సేవ్ ప్రియాంక' అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రియాంకపై దాడి చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి కోలుకోవాలంటూ ర్యాలీ
విశాఖలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు త్వరగా కోలుకోవాలంటూ టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి కోలుకోవాలంటూ ర్యాలీ