క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేక్ మిక్సింగ్‌కు విశాఖలోని డాల్ఫిన్ హోటల్ సిద్దమైంది. కేకుల తయారీ కోసం మిక్సింగ్(cake mixing for new year and cristamas) కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. డ్రై ఫ్రూట్స్, ఇతర ద్రవాలను కలియబెట్టి ఈ కేక్‌లను సిద్ధం చేస్తారు.
కొవిడ్ కారణంగా గతేడాది హోటళ్లలో క్రిస్మస్, న్యూఇయర్ సందడి బాగా తగ్గింది. ఈ సారి సాధారణ పరిస్ధితులు నెలకొనడం, అతిథుల రాకపోకలు పెరగడంతో కేక్ మిక్సింగ్‌పై హోటల్ నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ డాల్ఫిన్ హోటల్లో కేక్ మిక్సింగ్(cake mixing in dalaphine hostal at vishaka) నిర్వహించారు.