కరోనా కష్ట కాలంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ విశాఖ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయం ఎదుట తమ నిరసన తెలిపారు. కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను... కార్మికుల కోసం ఖర్చు చేయాలని నిర్మాణ రంగ కార్మిక సంఘం నాయకుడు వి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నిర్మాణ రంగ కార్మికుల సమస్యలకు సంబంధించిన వినతిపత్రం ఎమ్మెల్యేకు అందించారు.
ఎమ్మెల్యే కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికుల నిరసన - విశాఖ భవన నిర్మాణ కార్మికుల నిరసన తాజా వార్తలు
విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులను రూ. 10 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. అనంతరం ఆయనకు వినతిపత్రం సమర్పించారు.

ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన భవన నిర్మాణ కార్మికుల